బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్‌ఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాయ్‌కాట్ సెగ తగలడంతో ఓ రేంజ్‌లో నష్టపోయారు మూవీ టీమ్. అయితే ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు హీరో అమీర్‌ఖాన్ డైరెక్టర్ అద్వైత్ చందన్‌పై సీరియస్‌గా ఉన్నాడని పలు ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయి. అంతేకాకుండా అమీర్‌ఖాన్ డైరెక్టర్‌తో మాట్లాడటం కూడా మానేశాడని అన్నారు. తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ అద్వైత్ చందన్ స్పందించారు.
డైరెక్టర్ అద్వైత్ చందన్ అమీర్‌ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమీర్‌కు తనకు గొడవలు ఉన్నాయని అనుకుంటున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. జీనీ – అలాద్దీన్, బాలు – మోగ్లీ, అమర్ – ప్రేమ్ లాంటి రిలేషన్ మా మధ్య ఉంది అని రాసి ఫోటోకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అయినా అమీర్‌ఖాన్, అద్వైత్ మధ్య ఏం గొడవలు లేవని ఇకఅయినా నమ్ముతారో లేదో చూడాలి.