ముద్దుగుమ్మ కాజల్ ముద్దుల తనయుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫోటో షేర్ చేసింది. దీంతో పాటు తన కొడుకు గురించి తన మనసులో మాటలను ఓ పోస్ట్‌లో పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట తెగ వైరల్ కావడంతో పాటు అందరి మనసుల్ని హత్తుకుంటోంది. కాజల్ ఏం రాసిందో మీరు చదివేయండి..
మై లవ్.. మై నీల్.. నువ్వు పుట్టి అప్పుడే 6 నెలలు పూర్తయింది. టైం ఎంత తొందరగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్‌గా నీ విషయంలో నేను ఫస్ట్‌లో చాలా భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అని అనుకున్నా. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నిత్యం నేర్చుకుంటూనే ఉన్నా. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా టైం ఎప్పుడూ స్పెండ్ చేస్తూనే ఉంటా. నీ పై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడను. నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను, మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాం. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటా.