అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది.
ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతపరిచారు.మైక్రోసాఫ్ట్ గ్రూపు ప్రొడక్ట్ మాజీ మేనేజర్ కేసీ లెమ్సన్..తనను ఉద్యోగం నుంచి తీసివేశారని ట్టిట్టర్‌లో వెలిబుచ్చారు. దీనిపై సంస్థ స్పందిస్తూ..వ్యూహాత్మక మార్పుల్లో భాగంగానే కొంత మందిని తీసివేసినట్లు తెలిపింది.
అమెరికాకు చెందిన న్యూస్ వెబ్‌సైట్ యాక్సియోస్ కథనం ప్రకారం..పలు విభాగాలకు చెందిన వెయ్యి మందిని తీసివేసినట్లు వెల్లడించింది. మరోవైపు, సోషల్ ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ కూడా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడింది.