బీహార్‌లోని ఓ హాస్పిటల్‌లో ఇద్దరు అబ్బాయిల్ని ఓ నర్సు పెద్ద కర్రతో చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమని కొట్టొద్దని యువకులు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా కొట్టింది. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా హాస్పిటల్‌లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ హాస్పిటల్‌లో నెటకొన్న పరిస్థితులు వారి కంట పడడంతో వాటిని తన సెల్‌ఫోన్లతో వీడియో తీశారు. దీన్ని గమనించిన నర్సు, సిబ్బంది వారిని ఓ గదిలో బంధించారు. అనంతరం వీడియో డిలీట్ చేయమని కర్రతో చితక్కొట్టారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో బీహార్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు ట్యాగ్ చేస్తూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కొంత మంది నెటిజన్లు ఆ యువకులే నర్సులతో అసభ్యంగా ప్రవర్తించి, వీడియో తీసుంటారు అందుకే కొట్టారని వారు చేసింది కరెక్టేఅని ట్వీట్ చేస్తున్నారు.