ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో రాత్రిళ్లు తలస్నానం చేస్తుంటారు. మరికొందరు తలమొత్తం తడిసి పోకుండా జుట్టు మాత్రమే శుభ్రం చేసుకొని, తుడుచుకోకుండానే పడుకుంటారు. దీనివల్ల ఎంత నష్టమో ఇప్పుడు తెలుసుకుందాం..
- రాత్రిపూట తలస్నానం చెయ్యడం వల్ల ఉదయం లేవగానే జుట్టు బాగా చిక్కులు పడిపోతుంది. మృదువుగా కూడా ఉండదు.
- రాత్రిపూట జుట్టును శుభ్రం చేసుకొని, అలాగే పడుకోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. నిద్రపట్టదు.
- నిద్రలో అటూ ఇటూ మెసలడం వల్ల జుట్టు బాగా చిక్కులు పడిపోతుంది, రాలిపోతుంది.
- తడి జుట్టుతోనే పడుకుంటే దిండు కారణంగా జుట్టు ఆకృతి మారిపోతుంది. పైగా రాత్రంతా తడిగా ఉండటం వల్ల జుట్టుకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావొచ్చు. జలుబు చేసే అవకాశం ఎక్కువ.
- మాడు కూడా తడిగా ఉంటే.. శిలీంధ్రాలు, పేలు, చుండ్రు పెరిగిపోవచ్చు. వీటివల్ల విపరీతమైన దురద.
- రాత్రిపూట జుట్టును కడిగినా, తలస్నానం చేసినా.. శుభ్రంగా తల మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇందుకు బ్లో డ్రైయర్‌ను ఉపయోగించవచ్చు. తర్వాత వదులుగా జడవేసుకోవడం మర్చిపోవద్దు.