ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్-కె’ వంటి భారీ సినిమాలో నటిస్తున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ భామ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో రూపొందించబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి.
నిజ జీవిత ఘటనలతో స్ఫూర్తి పొందిన అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్ర నిర్మాణం చేపట్టబోతున్నారని సమాచారం. తాజాగా ఈ చిత్రంలో దీపికా పడుకోన్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.