జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతున్న సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ నుంచి జంప్ అవుతారని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కల్లోలం రేపాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు.. ఎంపీలైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మరోవైపు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేను కాదంటే నేను కాదంటూ భుజాలు తడుముకొంటున్నారు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం చాలా రోజుల నుంచే జరుగుతున్నది. పలు సందర్భాల్లో ఆయన కూడా నర్మగర్భంగా చెప్తున్నారు. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయకుండా గమ్మున ఉంటున్నారని నల్లగొండ జిల్లా రాజకీయాల్లో టాక్.