తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలోని పసునూరులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అస్త్రాలన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నామని చెప్పారు.
ఆ పార్టీకి ఓట్లేస్తే మీటర్లు పెట్టాలని రాసిచ్చినట్లే అవుతుందన్నారు. అందువల్ల అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితిలో బీజేపీని అడుగు పెట్టనివ్వొద్దని సూచించారు. ముఖ్యంగా మహిళలు.. పెంచిన గ్యాస్ ధరలను గుర్తుపెట్టుకొని బీజేపీ వాళ్లకు బుద్ధిచెప్పాలన్నారు.