నవీన్ ఇరగాని దర్శకత్వంలో ఎస్.రాజశేఖరరెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రియాంక డే టైటిల్ పాత్రను పోషించిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మొదలైంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌ను హీరో అడవి శేష్ రిలీజ్ చేసి ‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం. 84 మంది కొత్త నటీనటులతో ఈ సినిమాను తీయడం విశేషం. సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ఒక నిమిషం 41 సెకన్ల నిడివి కలిగిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ఎవడైనా బాగుపడాలన్నా, సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ‘ఇక చివరిగా.. నా పేరు హసీనా. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తాగి ఉండాలి, లేక మేధావి అయినా అయి ఉండాలి’ అని చెప్పిన డైలాగ్ ఆసక్తి పెంచుతోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు చెప్పారు.