కర్వాచౌత్.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించే ఓ వేడుక. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని పెళ్లయిన మహిళలు పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు. రాత్రి చంద్రుడుని దర్శించుకొని పూజ పూర్తి చేస్తారు. ఇందులో భాగంగా జల్లెడలో చంద్రుడిని చూని వెంటనే భర్త మొఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లి కాని యువతులు కాబోయే భర్తతో కలిసి పూజ చేస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. తాజా పూనమ్ కౌర్ ఈ కర్వాచౌత్ వేడుకలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు.
పూనమ్ కౌర్ జల్లెడ పట్టుకొని చంద్రుడి వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు పూనమ్ మేడమ్.. ఈ పండగ పెళ్లైన మహిళలు మాత్రమే చేస్తారు. మరి మీరు ఎందుకు చేస్తున్నారు. మీకు ఏమైనా పెళ్లి ఫిక్స్ అయ్యిందా.. కాబోయే భర్త కోసం పూజ చేస్తున్నారా.. అంటూ ప్రశ్నల వర్షం కురిసిస్తున్నారు.