తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది.
శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక కొడుకు 3 నెలల క్రితం కాలాపత్తర్‌కు చెందిన ఓ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
కొడుకు పెళ్లి తాను చేయలేదని కట్నకానుకలు రాలేదని మెరాజ్ సుల్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కొడుకు తన భార్య ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుందని.. జీతం మొత్తం తెచ్చి నీకే ఇస్తుందని సర్దిచెప్పాడు. అయితే కోడలు జీతం ఆమెకు ఇవ్వకుండా మొత్తం తన పుట్టింటికి ఇస్తోందని అత్త కోపంతో కొడుకు, కోడల్ని ఇంటి నుంచి బయటకు పంపేసింది. విషయం తెలుసుకున్న కూతురు అమెరికా నుంచి తమ్ముడుకి ఫోన్ చేసి వారం రోజులు అత్తింట్లో ఉండమని అమ్మకు తాను చెబుతానని చెప్పింది. తర్వాత అమ్మకు ఫోన్ చేసింది. తల్లి ఫోన్ తీయకపోవడంతో తమ్ముడికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమంది. ముజఫర్ ఇంటికి వెళ్లగా తలుపు లాక్ చేసి ఉంది. అనుమానంతో వంటగదికి వెళ్లి చూడగా ఆమె కాలిన గాయాలతో తల్లి మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సుల్తానా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని సూసైడ్ చేసుకుందని నిర్ధారించారు.