తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏలు సమావేశమై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎస్ సోమేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో.. రేపట్నుంచి విధులకు హాజరవుతాయని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సమస్యలను పరిష్కారిస్తామని సీఎస్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ప్రమోషన్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరామని, సీఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వీఆర్ఏలు గత 80 రోజులుగా వారి హక్కుల కోసం ఉద్యమం చేశారు. సమ్మె కాలం జీతం,దానితో పాటు సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటిపై మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.