జపాన్‌లో ఓ వృద్ధురాలికి ప్రేమ పేరుతో భారీ షాక్ తగిలింది. తానో వ్యోమగామి అని అంతరిక్షంలో ఉన్నానని కిందికి రాగానే పెళ్లి చేసుకుందాం అని ఆ పెద్దావిడను బుట్టలో వేసుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలంటే డబ్బు కావాలని ఆమె నుంచి దాదాపు రూ.24 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు పంపించమని చెప్పగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఊహించని షాక్ ఇచ్చాడు.
జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి ఇన్‌స్టా ప్రొఫైల్ చూసిన ఓ వ్యక్తి ఆమెతో స్నేహం చేశాడు. తాను ఓ వ్యోమగామి అని.. అంతర్జాతీయ స్పేస్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. స్పేస్ సెంటర్ పనిచేస్తున్నట్లు కొన్ని నకిలీ ఫోటోలను ఆమెకు పంపించాడు. నిజమే అని నమ్మిన వృద్ధురాలు అతడితో స్నేహం చేసింది. ఆపై ఇద్దరూ మెసేజ్‌లు, ఫోన్లు కామన్ అయిపోయాయి.
ఓ రోజు ఆ వ్యక్తి వృద్ధురాలిని పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. తనతో కొత్త జీవితం ప్రారంభించాలని గాఢంగా ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. నిజం అని నమ్మిన వృద్ధురాలు ఓకే చెప్పింది. అయితే అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలి అంటే చాలా ఖర్చు అవుతుందని, జపాన్‌కు వెళ్లగలిగే రాకెట్‌కు ల్యాండింగ్ ఫీజు చెల్లించాలని ఆమెకు మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నిజమని నమ్మిన ఆమె 5 సార్లు రూ.24 లక్షలకు పైగా అతడు సూచించిన ఎకౌంట్లో వేసింది. ఆ వ్యక్తి ఇంకా డబ్బు పంపమని డిమాండ్ చేయగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అతడు నకిలీ వ్యోమగామి అని తేల్చారు.