ఏపీ మాజీ ముఖ్యమంత్రి .. ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఓ పొలిటీషియన్ గా.. ఓ ముఖ్యమంత్రిగా.. ఓ ఎమ్మెల్యేగా … అపరచాణిక్యుడిగా తెల్సిందే. ఆయనలో కూడా రోమాంటిక్ యాంగిల్ ఉందంట..
ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం అయిన ఆహ లో ప్రసారమై ఆన్ స్టాపబుల్ ప్రోగ్రాం వస్తున్న సంగతి తెల్సిందే. ఈ కార్యక్రమం యొక్క సీజన్ 2 తొలి ఎఫిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రానున్నారు.
ఈ కార్యక్రమం అక్టోబర్ పద్నాలుగో తారీఖున స్ట్రీమింగ్ కానున్నది. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య బాబు చంద్రబాబును మీరు మీ జీవితంలో మరిచిపోలేని చేసిన రోమాంటిక్ పని ఏంటని అడుగుతాడు. దానికి సమాధానంగా బాబు మాట్లాడుతూ నేను మీకంటే పెద్ద రోమాంటిక్ ఫెలోని.. కాకపోతే మీరు సినిమాల్లో చేస్తారు.. నేను కాలేజీ రోజుల్లో చేశాను అని సమాధానం చెప్తారు. మిగతాది ఈ కింది ప్రోమోలో చూడండి..