Home / MOVIES / విజయ్‌తో రిలేషన్.. రష్మిక ఏమందంటే!

విజయ్‌తో రిలేషన్.. రష్మిక ఏమందంటే!

రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, కలిసే మాల్దీవులు వెళ్లారని రకరకాల రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేతే రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా విజయ్‌కు సంబంధించిన వస్తువులు ఏమైనా కనిపించకపోతాయా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ పిక్‌లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్‌వే అంటూ రచ్చ చేశారు. తాజాగా రష్మిక తన రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది. తన మనసులోని మాటల్ని పంచుకుంది. ఇంతకీ రష్మిక ఏమని చెప్పిందంటే..

ప్రస్తుతం తనకి రిలేషన్‌షిప్ గురించి ఆలోచించే టైమ్ లేదని, వర్క్ మీద ఫోకస్ అంతా ఉందని చెబుతోంది రష్మిక. నేను ఓ నటిని కాబట్టి అందరూ నా గురించి తెలుసుకోవాలి అనుకుంటారని, సోషల్ మీడియాలో తాను చాలా యాక్టివ్‌గా ఉంటానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. 15 మంది స్నేహితులు మొత్తం వీలున్నప్పుడల్లా కలిసి ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చింది.

విజయ్ తనతో చాలా క్లోజ్‌గా ఉంటాడని, ఏవైనా వృత్తిపరమైన డౌట్స్ వస్తే అడుగుతానని తెలిపింది రష్మిక. విజయ్ తాను మంచి ఫ్రెండ్స్ అని, అన్ని విషయాలు షేర్ చేసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం తనకి రిలేషన్ లేదని, అలా ఉండాలి అంటే ఆ బంధానికి చాలా టైం కేటాయించాలని తెలిపింది. కానీ రష్మిక ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ చేయడం వల్ల రిలేషన్ గురించి ఆలోచించడం లేదని చెప్పింది. అంతే కాకుండా ప్రేమ అనేది నేచురల్‌గా పుడుతుందని, వార్తలు వస్తే కలగదని క్లారిటీ ఇచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat