మూడు విడతలుగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు రికార్డులు ద్వారా స్పష్టమవుతోంది.
ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌ను మొదటిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామని అంటువ్యాధుల నిపుణుడు లీ షుజియన్ తెలిపారు.
ఇక షాన్‌డాంగ్ ప్రావిన్సులో అక్టోబర్ 4వ తేదీ నుంచి BF.7 వేరియంట్ కేసులు ఉదృతి రీతిలో పెరుగుతున్నట్లు చెప్పారు.BF.7 సబ్ వేరియంట్ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే వార్నింగ్ జారీ చేసింది. రానున్న రోజుల్లో BF.7 సబ్ వేరియంట్.. డామినెంట్ వేరియంట్‌గా మారనున్నట్లు చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.