యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.
ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
— TRS Party (@trspartyonline) October 10, 2022