తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని జగిత్యాల మండల లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన సి హెచ్ ప్రశాంత్ మెదడు సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి ని స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకువచ్చారు..
దీంతో నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం 2 లక్షల 50వేల రూపాయల LOC ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ గారు.ప్రశాంత్ కి 2 లక్షల 50 వేల LOC రావడానికి కృషి చేసిన ఎమ్మేల్యే గారికి ప్రశాంత్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఆత్మ ఛైర్మెన్ రాజీ రెడ్డి,నాయకులు లక్ష్మణ్, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.