ఆన్‌లైన్‌లో ఫుడ్ తొందరగా వచ్చేస్తోందని ఎక్కువ మంది ఇంట్లో ఫుడ్ కంటే జొమాటో, స్వీగ్గీల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాటిలో ఫుడ్ డెలివరీ అనుకున్న టైంలో రాకుంటే డెలివరీ బాయ్‌పై కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేస్తారు. రేటింగ్ తక్కువ ఇస్తారు. అయినా కోపం తగ్గకపోతే ఫుడ్‌ను వెనక్కి పంపేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా దిల్లీలోని ఓ పెద్దాయన ప్రవర్తించారు. అనుకున్న టైం కంటే గంట లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై కోపం చూపించకుండా ఆయనకు బొట్టు పెట్టి అక్షింతలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దసరా రోజున దిల్లోలోని సంజీవ్ త్యాగి అనే ఓ పెద్దాయన జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ బాయ్ గంట లేటుగా ఫుడ్ తీసుకొచ్చాడు. ఆకలితో చాలా సేపటి నుంచి ఫుడ్ కోసం ఎదురుచూస్తోన్న సంజీవ్ త్యాగికి డెలివరీ బాయ్‌పై ఓ రేంజ్‌లో మండిపడతాడు అనుకుంటూ డెలివరీ బాయ్ భయపడుతూనే ఫుడ్ అందించిన డెలివరీ బాయ్‌కి వింత అనుభవం చేటుచేసుకుంది.
సంజీవ్ త్యాగి ఫుడ్ తీసుకోవడానికి వస్తూ డెలివరీ బాయ్ నుదిటిపై బొట్టు పెట్టి.. అక్షింతలు వేశాడు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో 90ల్లో వచ్చిన బాలీవుడ్ మూవీ విజయపథ్‌లోని ఆయియే ఆప్‌కా ఇంతిజార్.. అనే పాట ప్లే చేశాడు. డెలివరీ బాయ్ కూడా నవ్వుతూ తన హెల్మెట్ తీసి బొట్టు పెట్టించుకున్నాడు. ఈ వీడియోను త్యాగి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. దసరా సంబర్భంగా దిల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉన్నా ఆర్డర్ అందుకున్నా..థాంక్యూ జొమాటో అని రాసుకొచ్చారు. ఈ వీడియోను లక్షల మంది చూశారు. పెద్దాయన చేసిన పనికి నెటిజన్లు తిట్టకుండా ఇలా చేయడం చాలా బాగుంది అని అంటున్నారు.