ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త. ట్విట్టర్ కు మరో నూతన ఫీచర్ ను పరిచయం చేసింది. ఇప్పటివరకు ట్వీట్ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. వీడియోలు, ఇమేజ్లు, జిఫ్ఫైల్.. ఇలా ఒకే ట్వీట్లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విటర్ తీసుకొచ్చింది. ఈ మూడింటిని కలిపి ఒకే ట్వీట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ట్విటర్ ఈ అవకాశాన్ని అందించింది.
