తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ,వైఎస్సార్టీపీ,బీఎస్పీ పార్టీలకు చెందిన నేతలు అనుముల రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ,ఈటల రాజేందర్,వైఎస్ షర్మిల,ఆర్ఎస్పీ తమదైన శైలీలో విమర్షల వర్షం కురిపించిన సంగతి విదితమే. అఖరికి ఇటీవల తమ పార్టీ గుర్తింపును ఈసీ రద్దు చేసిన ప్రజాశాంతి పార్టీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఇతర రాష్ట్ర బహిరంగ సభను ఏపీలో అది సంక్రాంతి పండుగ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూత్రప్రాయంగా మీడియా చాట్ లో తెలిపారు. ఆ తర్వాత ఏపీ అధికార పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్మీట్లలో సమయం ..వీలున్న ప్రతిసారి బీఆర్ఎస్ పై అగ్రహాం వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. గుడివాడ అమర్నాథ్ దగ్గర నుండి ఇటీవల మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు బీఆర్ఎస్ ఏర్పాటుపై మాట్లాడారు. తాజాగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ గారు కాదు ఆయన తాత వచ్చిన కానీ ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదే.. తమదేనంటూ కుండలు బద్దలు కొట్టినట్లు తెలిపారు.
అయితే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన తీరు బీఆర్ఎస్ వల్ల తమకే నష్టముందనే స్థాయిలో వైసీపీకి చెందిన నేత.. మంత్రి అయిన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడినట్లు పొలిటీకల్ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ వల్ల తమకు అంత నష్టం లేనప్పుడు ఎందుకు తోక కాలిన కోతిలా చిందులేయడమని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు మాత్రం కుయ్యమనడం లేదు.
ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని.. అప్పటి ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కేసీఆర్ ఇటు డిప్యూటీ స్పీకర్ పదవికీ.. అటు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎలా తెలంగాణను సాధించాడో.. గత ఎనిమిదేండ్లుగా ముఖ్యమంత్రిగా పాలనదక్షకుడిగా రాష్ట్రాన్ని దేశంలో ఏవిధంగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడో.. తన సత్తా తెల్సిన వారిగా టీడీపీ నేతలు నోర్లు మెదపడం లేదని పొలిటికల్ గాసిప్స్ లో గుసగుసలు. ఏది ఏమైన కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేసే పార్టీల పీఠాలు కదిలించబోతుందని టాక్ విన్పిస్తుంది..