చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భారత్ హాజరుకాలేదన్న సంగతి విధితమే. అయితే ఈ అంశం గురించి ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగారు మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.
ట్విట్టర్ వేదికగా ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుందో ప్రధాని మోదీ వివరిస్తారా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే ప్రధానమంత్రి నరేందర్ మోదీ 18 సార్లు జీ జిన్‌పింగ్‌ను కలిశారని, అయినా మానవ హక్కుల ఉల్లంఘనపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. జిన్‌పింగ్‌తో ఈ విషయం మాట్లాడటానికి మోదీ భయపడుతున్నారా..? ఆయన అన్నారు.