అప్పటి ఉమ్మడి ఏపీలో 1967 నుంచి ప్రతిసారీ పోటీచేస్తున్న సీపీఐ ఈసారి ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో దిగలేదు. వామపక్షాలు తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. 1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గంగా ఉంది…
ఆ తర్వాత 1967లో మునుగోడుగా మారింది. 1967 నుంచి 1983 వరకు వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. 1985 నుంచి 1994 వరకూ మూడుసార్లు సీపీఐ అభ్యర్థి నారాయణరావు గెలుపొందారు.
1999లో మళ్లీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. 2004లో పల్లా వెంకట్‌రెడ్డి (సీపీఐ), 2009లో యాదగిరిరావు (సీపీఐ), 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (తెరాస), 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) గెలిచారు.