త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది టీఆర్ఎస్ పార్టీ. మునుగోడు టికెట్ కోసం చాలా మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నించారు. తీవ్ర చర్చల అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఫైనల్ చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ ఎన్నికకు ఇటీవల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.