త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..
విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు వైజాగ్‌కు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కూతురు నిహారికతో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత వచ్చిన మొదటి దసరా పండగ అవ్వడంతో కాబోయే అల్లుడ్ని భోజనానికి పిలిచారు అత్తింటివారు. ఈ విందులో ఏకంగా 125 రకాల వంటకాలు ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి. 95 రకాలు బయట కొని తీసుకువచ్చారు. మిగిలినవి అంతా ఇంట్లోనే తయారు చేశారు. అన్ని రకాల వెరైటీలు ఒక్కసారి చూసిన అల్లుడు షాక్ అయ్యాడు. వాటిలో చాలా వాటి పేర్లు కూడా తెలీదని నోరెళ్లబెట్టాడు.