బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌పై ఈ ఏడాది టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో దినేశ్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నదని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే.. తాను ఇలాంటివేవీ పట్టించుకోనని, ఏదో సరదాగా అలా అన్నానని చెప్పాడు. స్థానం ఏదైనా ఆడినంత సేపు ఆటను ఎంజాయ్ చేయడమే తనకిష్టమని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లలో భారత జట్టు విజయం సాధించగా.. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో నెగ్గి దక్షిణాఫ్రికా పరువు దక్కించుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు.
మంగళవారం నాటి మ్యాచ్‌లో నాలుగో పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడటంతో.. నాలుగో స్థానంలో సూర్యకుమార్‌కు బదులుగా బెస్ట్ ఫినిషర్ దినేశ్ కార్తీక్‌ను పంపించారు. జట్టు నమ్మకాన్ని వమ్ము చేయకుండా దినేశ్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి అవుటయ్యాడు. దీనిపై సూర్యకుమార్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.