తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్… భారత్ రాష్ట్ర సమితిగా మారింది. అనంతరం ఈ తీర్మానంపై సీఎం సంతకం చేశారు. ఈ పేరు మార్పును పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశామని తెలిపారు. కేసీఆర్ పార్టీ పేరు చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
