ఉత్తరప్రదేశ్‌లోని ఓ బస్తీలోని ఓ మహిళ జీవితం సోషల్‌మీడియాలో పరిచయమైన ఓ వైద్యుడి వల్ల నాశనం అయ్యింది. స్నేహం ముసుగులో ఆమెను డాక్టర్, తన ఫ్రెండ్స్ రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది.
కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ డాక్టర్‌కు బస్తీలోని ఓ మహిళకు సోషల్ మీడియాలో స్నేహం కుదిరింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో డాక్టర్ ఆమెను హాస్పిటల్‌కు రమన్నాడు. ఆమె వెళ్లగా అక్కడి నుంచి డాక్టర్ తన హాస్టల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు అయిన తన ఫ్రెండ్స్ మరో ఇద్దరితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు డాక్టర్‌ను అరెస్టు చేశారు.