పల్నాడు జిల్లా మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుతాడు అనుకొని చిటికెన వేలు కోసేశారు అక్కడి స్టాఫ్.
స్వరూప అనే మహిళ డెలివరీ కోసం ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చేరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె స్ఫృహలోకి రాకముందే బొడ్డుతాడు కోసే క్రమంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు బాబు కుడిచేతి చిటికెన వేలు కోసేసింది. అనంతం రక్తస్రావం కావడంతో వెంటనే గుంటూరులోని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ హాస్పటిల్‌కు తరలించారు. అయితే బాబు వేలు చివర్లో తెగిందని ఆపరేషన్ చేసి అతికించేస్తామని వైద్యులు చెప్తున్నారు.
కాగా వైద్యులు, నర్సులు ఉండాల్సిన డెలివరీ టైంలో పారిశుద్ధ్య కార్మికురాలు ఉండడం ఏంటో పైగా ఆమె బొడ్డు తాడు కోయాలి అనుకోవడం ఏంటో అని సర్వాత్రా సందేహాలు వ్యక్తంఅవుతున్నాయి. ప్రస్తుతం సంబంధిత కార్మికురాలిని విధుల నుంచి తొలగించారు. విచారణ జరిపి నిజనిజాలు తెలుసుకోనున్నారు.