Home / BHAKTHI / సద్దుల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు..?

సద్దుల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు..?

తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన  పూలసంబురం బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు.

అలసిన అమ్మవారికి ఘనమైన పాకాలు నివేదన చేస్తారు భక్తులు. ‘పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ అంటూ అమ్మకు రకరకాలైన నైవేద్యాలు పెడతారు.

గ్రామీణులు సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన సద్దులు చేస్తారు. అందుకే చివరి రోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు.

సాయంత్రం కాగానే పిల్లాజెల్లా అందరూ బతుకమ్మ ఆడటానికి అందంగా ముస్తాబై కదలివస్తారు. మగవాళ్లు సైతం ఈ ముచ్చటను చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారు. ఊరంతా చెరువు కట్టకు ఊరేగింపుగా తరలివెళ్తారు. ‘తంగేడు పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ.. పోతె పోతివిగాని చందమామ.. మళ్లెప్పుడొస్తావు చందమామ.. ఏడాదికోసారి చందమామ.. నువ్వొచ్చి పోవమ్మ చందమామ’ అంటూ తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat