వాట్సాప్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముందస్తుగా 10 లక్షలకుపైగా అకౌంట్లను బ్యాన్ చేశామని తెలిపింది.
నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉద్దేశించిన తమ ఫిర్యాదుల పరిష్కార చానెల్‌లో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ సంస్థ యూజర్ల ఖాతాలపై చర్యలు తీసుకొన్నది. జూలైలో 23.87 లక్షల ఖాతాలను బ్యాన్ చేయగా, జూన్‌లో ఈ సంఖ్య 22 లక్షలు, మేలో 19 లక్షలుగా ఉన్నది.