Home / MOVIES / అదే హైబ్రిడ్‌పిల్లకు తృప్తి ఇస్తుందట!

అదే హైబ్రిడ్‌పిల్లకు తృప్తి ఇస్తుందట!

తన నటన, క్యారెక్టర్‌తో లేడీ పవర్‌స్టార్ అనిపించుకుంటున్న సాయి పల్లవి తాను ఎంపిక చేసుకునే పాత్రల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ హైబ్రిడ్‌పిల్ల నటించాల్సిన సినిమాలో పాత్ర నచ్చితే చాలు ఇట్టే ఓకే చేసేస్తుందే తప్ప హిట్టు, ఫ్లాపుల గురించి ఆలోచించనని చెప్తోంది.

మనసుకు నచ్చిన క్యారెక్టర్స్ చేస్తున్నానా లేదా అనేది మాత్రమే తనకు సంతృప్తి ఇస్తుందంటోది సాయిపల్లవి. ఓ క్యారెక్టర్ ఎలా చేయాలి అనే విషయంలో ఎలాంటి రూల్స్ పెట్టకోదట ఈ ముద్ధుగుమ్మ. తన పాత్ర కోసం ముందుగానే సిద్ధమయ్యేందుకు ఏ ప్రయత్నాలు చేయదట. కేవలం ఆ సమయంలో కో ఆర్టిస్ట్ నటన చూసే తాను ఎలా నటించాలో అనే విషయం క్లారిటీ తెచ్చుకుంటా అని చెప్తోంది సాయిపల్లవి. సినిమా కథ చదివేటప్పుడు ఓ ప్రేక్షకుడిలా ఆలోచించి చదువుతుందట. అప్పుడే దాని వల్ల తన క్యారెక్టర్ అందులో ఎలా ఉండబోతుందో అర్థం చేసుకుంటుంది. అయితే కొన్ని సార్లు స్క్రిప్ట్‌లో ఉన్నట్లు మూవీ రాకపోతే ఫ్లాపులు తప్పవు. ఆటైంలో ఆ చేదు ఫలితాలు కూడా జీవితంలో గొప్ప పాఠాలు నేర్పుతాయని చెప్పుకొచ్చింది హైబ్రిడ్‌పిల్ల.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat