కలిసి కాపురం చేసిన ఆరేళ్ల తర్వాత తన భార్య ఆడది కాదని పురుషుడని తెలియడంతో ఆ భర్త కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి మురైనాకు చెందిన అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఏదో కారణాలు చెప్పి ఆ యువతి భర్తను దూరం పెడుతూ వస్తోంది. దీంతో ఆ భర్తలో అనుమానం సార్ట్ అయింది. ఆమె ఆడది కాదని మగాడని ఆరోపించాడు. తనను మోసం చేశారని భార్య, ఆమె తండ్రిపై కంప్లైంట్ ఇచ్చాడు. చీటింగ్ కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే తన భార్య మాత్రం తనకు హార్మోన్ సమస్య ఉందని అందుకు చికిత్స చేయించుకుంటున్నానని అందుకే ఇలా ఉన్నానని తెలిపింది. అయితే భర్తకు మాత్రం అనుమానం తీరలేదు. దీంతో భార్యకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె పురుషుడని తేలింది. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు వారి పెళ్లిని క్యాన్సిల్ చేసింది.
