దక్షిణాఫ్రికాతో నిన్న బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా అతను 50 రన్స్ చేశాడు. అయితే ఏడో ఓవర్లో ఓ భారీ సిక్సర్ కొట్టాడతను. నోర్జా వేసిన లెగ్‌సైడ్ బంతిని అతను ఫ్లిక్ చేశాడు.
ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్‌మ్యాన్ దిశగా సిక్సర్ వెళ్లింది. ఇక తర్వాత బంతిని కూడా అతను బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా మరో సిక్సర్ కొట్టాడు. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది.
మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 రన్స్ చేసింది. ఆ తర్వాత భారత్ ఆ లక్ష్యాన్ని మరో 20 బంతులు ఉండగానే చేధించింది. రాహుల్ 51, యాదవ్ 50 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. స్టన్నింగ్ సిక్సర్ కొట్టిన సూర్య కుమార్ యాదవ్ వీడియో ఇదే.
Hit it like SKY! ??
Enjoy that cracking SIX ? ?Follow the match ▶️ https://t.co/L93S9k4QqD
Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia pic.twitter.com/7RzdetvXVh
— BCCI (@BCCI) September 28, 2022