బిహార్‌కు చెందిన ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే.. ఓకే పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే పైగా వరసకు అన్నాచెల్లెళ్లు. అందుకే వారు కలిసి తిరుగుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో ప్రస్తుతం ఆ బాలిక ప్రెగ్నెంట్.
ఇంట్లో, ఊళ్లో తెలిస్తే గొడవ జరుగుతుందని భయపడిన వారు బిహార్ నుంచి పారిపోవాలని భావించారు. ఈ క్రమంలో 22న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో వారిని దివ్యదిశ చైల్డ్‌లైన్ ప్రతినిధులు గుర్తించి ఆరా తీయడంతో అసలు విషయం చెప్పారు. దీంతో వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ముందుగా బాలుడి తల్లిదండ్రులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. తర్వాత బాలిక కుటుంబ సభ్యులు జీఆర్పీలో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. కేసును బిహార్ పోలీసులకు అప్పగించారు రైల్వే పోలీసులు.