అబార్షన్లపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరకీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. బలవంతపు ప్రెగ్నెన్సీ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారు అంటూ తేడా లేకుండా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంటుందని తెలిపింది. ఎంటీపీకి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
