లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్‌లో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి 5 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ అలీ ఒక్కడే అజేయంగా 51 రన్స్ చేశాడు. చివరి ఓవర్‌లో 15 రన్స్ అవసరం అయ్యాయి.
బౌలర్ ఆమిర్ జమాల్ ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్లకు 139 రన్స్ మాత్రమే చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 63 రన్స్ చేశాడు. ఈ సిరీస్‌లో రిజ్వాన్‌కు ఇది నాలుగవ హాఫ్ సెంచరీ కావడం విశేషం.