Home / MOVIES / మహేశ్ బాబు తల్లి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్

మహేశ్ బాబు తల్లి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్

సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి(70) ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఇందరాదేవి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ ..సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఇందిరాదేవి మృతిపై ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

చిరంజీవి ట్విట్టర్‌లో ‘శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్‌ స్టార్‌ కృష్ణ గారికి, సోదరుడు మహేష్‌బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్‌ చేశాడు. ఇక ఇందిరాదేవి అంతిమ సంస్కారాలను బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat