టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యం పాలయ్యారు. రెండు రోజుల క్రితం సీరియస్ అవ్వడంతో ఏఐజీ హాస్పిటల్స్‌లో చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.
ఇందిరా దేవి, సూపర్‌స్టార్ కృష్ణ 1961లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హీరో మహేశ్‌బాబుతో పాటు రమేశ్ బాబు, మంజుల, పద్మావతి, ప్రియదర్శని సంతానం. 1969లో కృష్ణ విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు.