ఏపీ సీఎం… వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు.
అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలను తీసుకొచ్చారు.