వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది.
కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో ఆగస్టులో పెళ్లి చేశారు. ఆ వ్యక్తి బాలిక తల్లిదండ్రులకు 7 తులాల బంగారం, రూ.2 లక్షల డబ్బులు ఇచ్చాడు. అయితే అతనితో కాపురం చేయడం ఇష్టం లేక ఆ బాలిక సోమవారం తల్లిదండ్రులకు తెలియకుండా స్పందనలో ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే ఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని దిశ పోలీసులకు ఆదేశించారు.