హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా రోడ్లపైకి వరదనీరు రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ మొదలైన చోట్ల వర్షం పడింది. ఆఫీసుల నుంచి వచ్చే వారు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల మ్యాన్‌హోల్స్ ఓపెన్ కావడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాటికి మరమ్మతులు నిర్వహించి వరద నీటిని మళ్లించారు.