జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు.
దీనికి సంబంధించిన పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ పేరును వెల్లడించనున్నారు.
కాగా, జాతీయ పార్టీనే ప్రకటిస్తారని తెలుస్తున్నది. అయితే ముందుగా జమ్ముకశ్మీర్‌తో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కశ్మీర్‌లో ఒంటరిగా పోటీచేయనున్న ఆయన.. ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకోనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.