ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్ స్టేడియంలో బాక్స్ నుంచి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. క్రీడాశాఖ తరఫున ఆమెకు ప్రమోషన్ ఇస్తామని చెప్పారు. టికెట్ల వ్యవహారంపై స్పందిస్తూ క్రికెట్ ఫ్యాన్స్ జీవితాలతో ఆటలు ఆడుకుంటే కఠినచర్యలు తప్పవని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. టికెట్ విక్రయంలో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.