ఓ మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న భర్త.. తన భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఆమె భర్త.. మరో మహిళతో కలిసి తిరగడాన్ని భార్య బంధువులు గుర్తించి ఆమెకు చెప్పారు. దీంతో, భర్తకు తన ప్రవర్తన మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ భర్త మారకపోవడంతో విసుగుచెందింది. ఎప్పటి నుంచో అతడి కదలికలపై భార్య దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో ఓ హోటల్‌లో లవర్‌తో తన భర్త ఉన్న విషయాన్ని భార్య తెలుసుకుని నేరుగా అక్కడే వెళ్లింది. దీంతో ఒక్కసారిగా షాక్ తినడం భర్త వంతైంది. ఇంకేముంది.. ఆ మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా భర్తను పట్టుకున్న భార్య.. వాళ్లిద్దరినీ చెప్పుతో ఉతికి ఆరేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలైంది. అనంతరం దీనిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.