చాలా కాలం తర్వాత చియాన్ విక్రమ్ ‘మహాన్’తో మంచి హిట్ తో కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోష్‌లో ‘కోబ్రా’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో నుండి కోబ్రా వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి.
విభిన్న గెటప్స్‌లో విక్రమ్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రం ఓటీటీ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ దక్కించుకుంది. ఈ
చిత్రాన్ని సెప్టెంబర్ 30 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అన్ని తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటుంది. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, మృనాళిని రవి హీరోయిన్‌లుగా నటించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు.