తెలంగాణ వైఎస్సార్టీపీ పార్టీ అధినేత .. ఏపీ ముఖ్యమంత్రి,ఆ రాష్ట్ర అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. ఈ పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చారు.
ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి షాకిచ్చేలా మాట్లాడారు. ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే.
దీని గురించి ” రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ అని పేరు మార్చడంపై మీ అభిప్రాయం ఏంటన్న జర్నలిస్ట్ ప్రశ్నకు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ‘పేరు మార్చకూడదు. దాని పవిత్రత పోతుంది. ఒక పేరు పెట్టారు. ఆ పేరును తరతరాల పాటు కంటిన్యూ చేస్తే వాళ్లకు గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే జనాలకు కూడా అర్థం కాదు. కన్ఫ్యూజన్ పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.