పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్లో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది. తాజాగా లైగర్ ఓటీటీలో విడుదలైంది. ఈరోజు(గురువారం) నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తే నెటిజన్లకు సర్ప్రైజ్ ఇచ్చింది ఈ సంస్థ. సడెన్‌గా ఓ ట్వీట్‌తో స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
