ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్.
అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే సుజాతతో ఆయన ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ తాము కూడా చాలాసార్లు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎప్పుడు చెప్పలేదు.. కానీ తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ లో రాకింగ్ రాకేష్ తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత.రోజా హౌస్ టూర్ లో భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సుజాత. అందులో రాకింగ్ రాకేష్ కూడా ఉన్నాడు. త్వరలోనే ఇద్దరి పెళ్లి గురించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఏదేమైనా జబర్దస్త్ షో నుంచి ఒక జంట పెళ్లి పీటలు ఎక్కనుండడంతో మిగిలిన వారు సంతోషపడుతున్నారు.