టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న ధోనీ 34, మూడో స్థానంలో ఉన్న విరాట్ 32 సిక్సర్లు బాదారు. హార్దిక్ ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలని పాండ్యా అభిమానులు ఆశిస్తున్నారు.
